Thursday, July 15, 2010

సాగు భూములను థర్మల్ విద్యుత్ కేంద్రానికి కేటాయించవచ్చునా ?

 ప్రియమైన మిత్రులారా , 
                                       నిన్నటి సోంపేట ఘటన ఆంధ్ర రాష్ట్ర చరిత్ర లో మరో చీకటి రోజు. విద్యుత్ చార్జీలు పెంచిన కారణంగా తొమ్మిది సంవత్సరాల క్రితం చంద్రబాబు  నాయుడు ప్రభుత్వం హైదరాబాదులో చేసిన మారణకాండ లో కూడా ముగ్గురు అమాయకులు ప్రాణాలు వదిలారు. ఆ రోజున జరిగిన ఘోరానికి అప్పటి ప్రభుత్వం తరువాతి ఎన్నికలలో ఘోర పరాజయాన్ని మూట కట్టుకోవాల్సి వచ్చింది. మళ్లీ తొమ్మిది సంవత్సరాల తరువాత అదే రకమైన సంఘటన. ప్రభుత్వం నియమించిన పోలీసులు జనం పై బుల్లెట్ల వర్షం కురిపించారు. ఆగ్రహం కట్టలు తెంచుకున్న జనంపైకి పోలీసుల  విచ్చల విడిగా కాల్పులు జరిపారు. ప్రాధమిక అంచనాల ప్రకారం ముగ్గురు రైతు కూలీలు ప్రాణాలు కోల్పోయారు. ఇదంతా దేని కోసం? వివరాల లోకి వెళ్తే ప్రభుత్వం  శ్రీకాకుళం జిల్లా సోంపేట లో  బొగ్గు తో నడిచే సుమారు 2000 మెగా వాట్ల విద్యుత్ తయారీ  కర్మాగారాన్ని నాగార్జున construction  కంపెనీ నెలకొల్పడానికి ముందుకు వచ్చింది. దాని కోసం వారికి సుమారు ౨౦౦౦ ఎకరాల భూమి కావాల్సి వచ్చింది. అక్కడి కలెక్టర్, మరియు ఇతర ప్రభుత్వ సిబ్బంది బాగా వెతికి సోంపేట కి దగ్గరలో  ౨౦౦౦ ఎకరాల సాగు  భూమిని సిఫార్సు చేసింది. ఐతే ఇందులో కేవలం 1300 ఎకరాలు ప్రభుత్వ భూమి కాగ మిగిలిన 800 వందల ఎకరాలు ప్రైవేటు భూమి. విషయం ఏమిటి అంటే ఈ భూమిలో ఇప్పటివరకు సంవత్సరానికి రొండు పంటలు  పండుతున్నాయి. దీన్ని నాయనో భయానో ప్రజల నుండి లక్కుండి మన ప్రభుత్వం. నిన్నటి రోజున నాగార్జున కొన్స్త్రుక్తిఒన్ కంపెనీ ఈ భూమి కొలతల కోసం సోంపేటకు వెళ్ళడం జరిగింది. ఐతే ఈ కర్మాగారాన్ని మొదటి నుండి వ్యతిరేకిస్తున్న గ్రామస్తులు అడ్డు పడతారు అని ముందే గ్రహించిన సదరు కంపెనీ యాజమాన్యం ప్రభుత్వ సాయం తో ౩౦౦౦ పైచిలుకు  పోలీసులను రక్షణ గా తీసుకు వెళ్ళింది. ప్రజలను ఇళ్ళ నుండి   బయటకు రాకుండా పోలీసులు గ్రామాలను పహారా కాయసాగారు.   ఐతే , ప్రజాశక్తి ముందు పోలీసులు నిలవలేక పోయారు. వేలల్లో తరలి వచ్చిన జనం కంపెనీ కార్యాలనికి చేరుకోసాగారు. అక్కడ వున్న కంపెనీ కిరాయి గూండాలు పోలీసులతో కలిసి వారిని అడ్డుకోడానికి ప్రయత్నించారు. కానీ వారి ఆగ్రహం ముందు నిలువలేక పోయారు. చేతికి దొరికిన వారిని దొరికి నట్టు చితక బాదుకుంటున్నారు. ఈ క్రమం లో పోలీసులు, మీడియా ప్రతినిధులు, కంపెనీ గూండాలు, ప్రజలు, అందరూ గాయపడ్డారు. చివరకి తమ గన్నులకు పని చెప్పిన పోలీసులు ముగ్గురు ఆందోళన కారులను బలిగొన్నారు. అ తరువాత జరిగిన యుద్ధాన్ని నా కంటే టీవీ 9 చుస్తే  మీకే తెలిసి వుంటుంది.  
 ఇందులో మనం గమనించాల్సిన విషయాలు కొన్ని వున్నాయి. 
మొదటగా సాగు భూములను ఇలా పర్యావరణానికి హాని చేసే బొగ్గు కర్మాగారానికి కేటాయించ వచ్చా  ? చేసినా దానికి స్థానికుల అనుమతి తీసుకోవాలా వద్దా ? ఇంతకీ కొసమెరుపు ఏమిటి అంటే సదరు కంపెనీ A. P Pollution control Board నుండి కనీసం అనుమతి కూడా తీసుకోలేదు అంట( tv9). మరి ఎందుకు ప్రభుత్వానికి ఆ కంపెనీ అంటే అంట ప్రేమ? ఏమో మరి ? సదరు కంపెనీ ఏ ప్రభుత్వ అధినేతదో మరి? ఇంకొక విషయం ఏమిటి అంటే ఇప్పటికే శ్రీకాకుళం జిల్లా లో పది వేల మెగావాట్ల బొగ్గు విద్యుత్ కర్మాగారాలు వివిధ స్థాయిలలో వున్నాయి సుమా. అంటే శ్రీకాకుళం లో ఇప్పటికే చాలా ప్రాజెక్టులు నడుస్తున్నాయి అన్న మాట. మహానది బొగ్గు వనరులులకు దగ్గరగా వుండడం, మంచి నీటి వనరులు పుష్కలంగా వుండడం, వీటి ప్రధాన కారణం. ఆధునిక భారత దేశం లో విద్యుత్ వినియోగం విపరీతం గా పెరిగి పోయింది. దాంతో ప్రభుత్వం ఇబ్బడి ముబ్బడి గా విద్యుత్ తయారీ కేంద్రాలకు అనుమతి ఇస్తోంది. మరీ చెత్త విషయం ఏమిటి అంటే భూములు కోల్పోయిన రైతులు మహా ఐతే ఆ తయారీ కేంద్రాలలో కూలీలుగా ఉద్యోగం చేసుకోవాలి. పచ్చని పంట పండించే వాళ్ళకి చివరికి మన ప్రభుత్వం ఇచ్చే ప్రతి ఫలం ఇది. కానీ పాలకులు చెప్పే మాటలు తెలుసు కదా, కంపెనీ వల్ల ప్రజలకి ఉద్యోగాలు వస్తాయి అంటే ఏదో మేనేజర్ లు ఐపోతారు  అనుకోకండి. పంట పొలాలను ధారాదత్తం చేసి వాళ్ళు కూలీలు కావాల్సిందే. మరి అంతా బాగుంది. ఈ విద్యుత్ ని ఎవరికీ అమ్ముతుంది సదరు కంపెనీ ? ఈ ప్రశ్న కి సమాధానం  మన రాష్ట్ర ప్రభుత్వం దగ్గర మాత్రం దొరకదు. ఎందుకంటే మనకి విద్యుత్ విధానం ఇంకా ఖరారు కాలేదు. పాత లెక్కల ప్రకారం పాతిక శాతం మాత్రమే మన ప్రభుత్వం కొనుగోలు చేయ్యగలదు.మిగాతా 75 శాతం ఆ కంపెనీ బహిరంగ మార్కెట్లో అమ్ముకోవచ్చు. అంటే మనకి దొరికేది ముష్టి ఐదువందల మెగావాట్లు అన్న మాట.  ఇదే గడ్డ పై అల్లురి సీతారామరాజు చేసిన పోరాటం గుర్తుకు వస్తోంది. అప్పుడు తెల్లదొరలు మనం పండించిన పంటని విదేశాలకు దోచుకు వెళ్తుంటే అడ్డుకున్న ఆతను చివరికి వారి తూటాలకు బలైపోయాడు. ఇది యాద్రూచికమ్  కావచ్చు. కానీ , ఇప్పటి ప్రభుత్వాల నిరంకుశత్వం చూస్తుంటే మళ్లీ అదే జరిగేల వుంది. వందల మంది ఎదురొచ్చిన కూడా వారిని తూటాలకు బలిచేసి తాము తలపెట్టిన పనిని చెయ్యగల సత్తా వారికి వుంది. ఆహార భద్రతా బిల్లు గురించి మనం చర్చించుకుంటున్న రోజులు ఇవి. పండించే వాడికి భద్రతా కల్పిస్తే ఆహరం భద్రత అదే వస్తుంది. కానీ మనం చేసేది ఏమిటో తెలుసా, పంటలు కూడా దిగుమతి చేసువాల్సి వస్తోంది. చివరకి అతి నీఛ స్థితి లో వున్న దాయాది దేశం పాకిస్తాన్ నుండి చెక్కర దిగుమతి చేసుకుంటున్నాం మనం. అంటే వున్న దాన్ని చేతులారా నాశనం చేసి, ఎక్కువ ధరలో పక్క దేశాల నుండి దిగుమతి చేసుకుంటున్నాం. ఇది మన ఘనకార్యం. నేను విమర్సిస్తున్నట్టు అనిపించినా ఇది నగ్న సత్యం. మరి దీని కోసం మనం ఏమి చెయ్యగలం? జలయజ్ఞం పేరు తో ఇప్పటికి మన రాష్ట్రం లో లక్షల కోట్లు ఖర్చు అయ్యాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఎంత భూమి సాగులోకి వచ్చిందో, గత ఐదు సంవత్సరాలలో ఎంత సాగు భూమి ఇతర  అవసరాలకు మల్లిన్చబడిందో వారికే తెలియాలి. ఇదంతా చూస్తుంటే ఎటు వెళ్తున్నాం మనం అని అనిపిస్తోంది. " పెరుగుట విరుగుట కొరకే" అన్న సామెత గుర్తుకు వస్తోంది. చివరకి భూమిని సర్వ నాశనం చేసి మనిషి అంతరిస్తాడు అని నా వూహ.    చూడాలి ఏమి జరుగుతుందో. నా మనసు లోని భావాలను వ్యక్త పరచడానికి నా ఈ చిన్ని ప్రయత్నం లో  లోపాలు వుంటే క్షమించగలరు. మీ సూచనలు సలహాలు అందించగలరు. 

మీ , 
అమరనాథ్. 

No comments:

Post a Comment