Saturday, August 21, 2010

Telugu Patriotic song

Hello everybody,
   This song was written by sree Rayaprolu Subba rao garu. Very good to learn byheart and sing it on some occassion.


  శ్రీలు పొంగిన జీవ గడ్డయి 
                                      -శ్రీ రాయప్రోలు సుబ్బారావు                                    

శ్రీలు పొంగిన జీవ గడ్డయి 
పాలు పారిన భాగ్య సీమయి
వ్రాలినది యీ భరతఖండము 
భక్తి పాడర తమ్ముడా !

వేద శాఖలు వెలసెనిచ్చట
ఆది కావ్యము బలరె నిచ్చట 
బాదరాయణ పరమఋషులకు 
పాదు సుమ్మిది చెల్లెలా !

విపిన బంధుర వృక్షవాటిక 
ఉపనిషన్మదు వొలికెనిచ్చట 
విపుల తత్వము విస్తరించిన
విమల తలమిది తమ్ముడా!

పాండవేయుల పదనుకత్తుల 
మండిమెరసిన  మహితరణ కధ
పండగల చిక్కని తెలుంగుల 
కలిపి పాడవె చెల్లెలా !

దేశగర్వము దీప్తి చెందగ
దేశచరితము  తేజరిల్లగ 
దేశమరసిన  ధీర పురుషుల 
తెలిసి పాడర తమ్ముడా !

లోకమంతకు కాక బెట్టిన 
కాకతీయుల కదనపాండితి 
చీకిపోవని చేవపదముల
చేర్చి పాడవె చెల్లెలా !

తుంగభద్రా భంగములతో 
బొంగి నింగిని బొడిచి  త్రిళ్ళీ
భంగపడని తెలుంగునాధుల 
పాట పాడర తమ్ముడా !

మేలి కిన్నెర మేళవించీ 
రాలు గరగగ రాగమెత్తి 
పాలతీయని బాలభారత 
పధము పాడవె చెల్లెలా !
  

No comments:

Post a Comment